ఉత్తరాఖండ్ లో దారుణం.. కారులో తల్లీ, కుమార్తెలపై అత్యాచారం

Woman 6 Year Old Daughter Gangraped In Moving Car Uttarakhand Policeఉత్తరాఖండ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. సాయం పేరుతో మానవ మృగాలు ఓ తల్లీ, ఆమె ఆరేళ్ల కుమార్తెపై వెళుతున్న కారులోనే అత్యాచారానికి పాల్పడ్డారు. హరిద్వార్ జిల్లా రూర్కీలో ఆదివారం ఈ దారుణం వెలుగుచూసింది. పోలీసులు ఇందుకు సంబంధించి వివరాలు వెల్లడించారు.ముస్లింలకు సంబంధించి ప్రార్థనా స్థలం పిరన్ కలియార్ నుంచి మహిళ, తన కుమార్తెతో ఇంటికి తిరిగి వెళుతుండగా, రాత్రి సమయంలో ఓ కారు వారి ముందు ఆగింది. కారు నడుపుతున్న సోనూ అనే వ్యక్తి లిఫ్ట్ ఇస్తామని చెప్పడంతో వారు కారులో ఎక్కారు. అదే కారులో సోనూ స్నేహితులు కూడా ఉన్నారు. అనంతరం కారులో ఉన్నవారు ఆ మహిళతోపాటు, చిన్నారిపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఓ కాలువ వద్ద దింపేసి వెళ్లిపోయారు. 
అర్ధరాత్రి సమయంలో బాధిత మహిళ, తన కుమార్తెతో కలసి పోలీసులను ఆశ్రయించి జరిగిన దారుణాన్ని చెప్పింది. ఇద్దరినీ రూర్కీ సివిల్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యుల పరీక్షలో ఇద్దరిపైనా అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ అయింది. కారులో ఎంత మంది ఉన్నారనే విషయాన్ని ఆమె స్పష్టంగా చెప్పలేకపోతున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
Nationalist Voice

About Author

error: Content is protected !!