ఈ నెల 27న సీఎం జగన్ నెల్లూరు పర్యటన

  • నేలటూరులో ఏపీ జెన్ కో 3వ యూనిట్ ప్రారంభోత్సవం
  • కొత్త యూనిట్ ను జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్
  • నేలటూరులో బహిరంగ సభ
ఏపీ సీఎం జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 27న జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో ఏపీ జెన్ కో ప్రాజెక్టు మూడో యూనిట్ ను ప్రారంభించనున్నారు. ఈ యూనిట్ సామర్థ్యం 800 మెగావాట్లు. జిల్లాకు సీఎం వస్తుండడంతో అధికారులు సంబంధిత ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు.

తన పర్యటనలో భాగంగా సీఎం జగన్ ఈ నెల 27న ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో బయల్దేరతారు. ఉదయం 10.55 గంటలకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ఉదయం 11.10 గంటల నుంచి మధ్యాహ్నం 1.10 గంటల వరకు నేలటూరులో ఏపీ జెన్ కో ప్రాజెక్టు మూడో యూనిట్ ప్రారంభత్సోవంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 3.30 గంటలకు తాడేపల్లి తిరిగి వస్తారు.

కాగా, జెన్ కో యూనిట్ ప్రారంభోత్సవానికి ఏపీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర నేతలు హాజరుకానున్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!