ఈడీ ఆఫీసుకు సోనియా.. వుమెన్ ఆఫీస‌ర్ నేతృత్వంలో విచార‌ణ‌

న్యూఢిల్లీ: నేష‌న‌ల్ హెరాల్డ్ మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ విచారిస్తోంది. అయితే విచార‌ణ స‌మ‌యంలో క‌నీసం అయిదుగురు ఆఫీస‌ర్లు ఉండ‌నున్నారు. అద‌న‌పు డైరెక్ట‌ర్ స్థాయి మ‌హిళా అధికారి కూడా విచార‌ణ‌లో ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఆ మ‌హిళా అధికారి ద‌ర్యాప్తు బృందానికి నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఒక‌వేళ ప్ర‌శ్న‌లు వేస్తున్న స‌మ‌యంలో సోనియా అల‌సిపోతే, ఆమెకు రెస్ట్ ఇచ్చేందుకు కూడా ఈడీ అధికారులు ప్రిపేర‌య్యారు. సోనియా త‌న కూతురు ప్రియాంకాతో క‌లిసి ఈడీ ఆఫీసుకు బ‌య‌లుదేరి వెళ్లారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!