ఇంగ్లీష్‌లో అదరగొట్టిన ప్రభుత్వ పాఠశాల పిల్లలు.. సీఎం జగన్ ఫిదా

నేషనలిస్ట్ వాయిస్, మే 19, అమరావతి :  సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలు అంటే చాలా మందికి చిన్న చూపు ఉంది. సర్కారీ బడుల్లో చదువు సరిగా చెప్పరని, నాణ్యమైన విద్య ఉండదని, టీచర్లు సరిగా రారని, ఇంగ్లీష్ లో వెనుకబడిపోతారని, క్లాసులు సరిగా నిర్వహించరనే అభిప్రాయాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే, ఆ అభిప్రాయాల్లో నిజం లేదని, అవి కేవలం అపోహలు మాత్రమే అని గవర్నమెంట్ స్కూల్ పిల్లలు నిరూపించారు. ముఖ్యంగా ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడి అదగొట్టారు. ఏకంగా సీఎం జగన్ ముందే ఇంగ్లీష్ స్పీచ్ ఇచ్చారు. వారి ప్రతిభ ఏ రేంజ్ లో ఉందంటే, సీఎం జగన్.. ఆ పిల్లల ఇంగ్లీష్ స్పీచ్ కి ఫిదా అయిపోయారు. శభాష్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలు అంటే చాలా మందికి చిన్న చూపు ఉంది. సర్కారీ బడుల్లో చదువు సరిగా చెప్పరని, నాణ్యమైన విద్య ఉండదని, టీచర్లు సరిగా రారని, ఇంగ్లీష్ లో వెనుకబడిపోతారని, క్లాసులు సరిగా నిర్వహించరనే అభిప్రాయాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే, ఆ అభిప్రాయాల్లో నిజం లేదని, అవి కేవలం అపోహలు మాత్రమే అని గవర్నమెంట్ స్కూల్ పిల్లలు నిరూపించారు. ముఖ్యంగా ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడి అదగొట్టారు. ఏకంగా సీఎం జగన్ ముందే ఇంగ్లీష్ స్పీచ్ ఇచ్చారు. వారి ప్రతిభ ఏ రేంజ్ లో ఉందంటే, సీఎం జగన్.. ఆ పిల్లల ఇంగ్లీష్ స్పీచ్ కి ఫిదా అయిపోయారు. శభాష్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.  ఇలాంటి కార్యక్రమాలతో, పథకాలతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారంటూ సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంగ్లీష్ మీడియం విద్యాబోధనతో ఎంతో మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోందన్నారు. ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోకుండా, ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ఎంతో లబ్ది చేకూరుతోందని పిల్లలు సీఎం జగన్ తో చెప్పారు. ప్రభుత్వ పథకాలు, వాటి వల్ల విద్యార్థులకు జరుగుతున్న మేలు గురించి పిల్లలు వివరిస్తుంటే.. సీఎం జగన్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ముఖ్యంగా, ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడడం ఆయనను అమితానందానికి గురిచేసింది. వారి ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని ఆద్యంతం చిరునవ్వుతో ఆస్వాదించిన సీఎం, ఆ విద్యార్థులను మనస్ఫూర్తిగా అభినందించారు. కాగా, ఏపీలో విద్యా వ్యవస్థ సంస్కరణలకు జగన్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన వంటి పథకాలు, విద్యార్థుల తల్లుల ఖతాలో నగదు జమ చేసే అమ్మ ఒడి పథకాలు అమలు చేస్తోంది. విద్యార్థులకు మనం ఇచ్చే ఏకైక ఆస్తి చదువు మాత్రమే, పిల్లల జీవితాల్లో వెలుగులు నింపేది విద్యా మాత్రమే అని పదే పదే చెప్పే జగన్.. పిల్లలకు నాణ్యమైన చదువు అందించే విషయంలో రాజీపడకూడదని నిర్ణయిచారు. అందులో భాగంగానే నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన తీసుకొచ్చారు. ఇక, పేదరికం చదువుకి అడ్డుకాకూదని, ప్రతి పిల్లాడు చదువుకోవాలనే ఉద్దేశ్యంతో అమ్మఒడి స్కీమ్ తీసుకొచ్చారు జగన్.

Nationalist Voice

About Author

error: Content is protected !!