ఆ రోజునే మహేశ్ .. త్రివిక్రమ్ మూవీ లాంచ్?

  • ఈ నెల 21న వచ్చిన ‘సర్కారువారి పాట’
  • ఆ తరువాత సినిమా త్రివిక్రమ్ తో చేయనున్న మహేశ్
  • ఈ నెల 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు
  • ఆ రోజున మహేశ్ మూవీ ఈ టైటిల్ రిలీజ్ చేసే ఆలోచన
మహేశ్ బాబు తాజా చిత్రంగా వచ్చిన ‘సర్కారువారి పాట’ సినిమా, ఈ నెల 12వ తేదీన థియేటర్లకు వచ్చింది. తొలి రోజునే రికార్డుస్థాయి ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఓవర్సీస్ లోను ఈ సినిమా గట్టి వసూళ్లనే రాబడుతోంది. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో కలిసి మహేశ్ బాబు సెట్స్  పైకి వెళ్లనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

త్రివిక్రమ్ – మహేశ్ బాబు సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని కొంతమంది వెయిట్ చేస్తుంటే, మరి కొంతమంది ఈ సినిమాకి ఏ టైటిల్ పెట్టనున్నారనే విషయంలో కుతూహలాన్ని  వ్యక్తం చేస్తున్నారు. జూలైలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు. ఇక ఈ నెల 31వ తేదీన ఈ సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేయనున్నట్టు  తెలుస్తోంది.

ఈ నెల 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు .. ఈ సందర్భంగా మహేశ్ బాబు 28వ సినిమా టైటిల్ ను ప్రకటించనున్న చెబుతున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మితం కానున్నట్టు ఈ సినిమాలో, మహేశ్ జోడీగా పూజ హెగ్డే అలరించనుంది. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

Nationalist Voice

About Author

error: Content is protected !!