ఆ తరహా పాత్రల నుంచి బయటపడటానికి చాలాకాలమే పట్టింది: ఎల్బీ శ్రీరామ్

  • రచయితగా .. నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఎల్బీ శ్రీరామ్
  • నాటకాలే సినిమాల దిశగా నడిపించాయన్న ఎల్బీ
  • ‘చాలా బాగుంది’ సినిమా గురించిన ప్రస్తావన
  • ఆ సినిమాలోని పాత్ర నటుడిగా బిజీ చేసిందని వెల్లడి
రచయితగా .. నటుడిగా ఎల్బీ శ్రీరామ్ కి మంచి పేరు ఉంది. రచయితగా ఆయన పనిచేసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. నటుడిగా ఆయన చేసిన సినిమాలు కూడా భారీ విజయాలను అందుకున్నాయి. ఒకానొక దశలో రాయడానికి కుదరనంత బిజీ నటుడిగా అయన కెరియర్ కొనసాగింది. తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ఆయన తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

“మొదటి నుంచి కూడా నాకు నాటకాల పిచ్చి ఉంది. ఆ నాటకాలకి నేనే రచయితను .. దర్శకుడిని .. అందులో ఒక నటుడిని కూడాను. అలా నాటకాలలో వచ్చిన పేరుతోనే సినిమాల్లోకి వచ్చాను. రచయితగా కొన్ని పాత్రలు రాస్తున్నప్పుడు ఆ పాత్రను నేను చేస్తే బాగుండేదే అనిపిస్తుంది. ఆ విషయాన్ని దర్శకుడికి చెప్పి నేనే ఆ పాత్రను చేసేవాడిని. అలా నటుడిగా నా ప్రయాణం మొదలైంది” అన్నారు.

‘చాలా బాగుంది’  సినిమాలో నేను చేసిన పాత్ర నాకు చాలా మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆ పాత్ర ఒక రేంజ్ లో జనాలకు కనెక్ట్ కావడంతో, అదే తరహా పాత్రలు వరుసగా వచ్చాయి. ఆ పాత్ర తీసుకొచ్చిన గుర్తింపు నుంచి బయటపడి .. మరో కొత్త పాత్రను పోషించడానికి చాలా కాలమే పట్టింది. నాకు పేరు తెచ్చిపెట్టిన యాసలో మాట్లాడకపోవడం వల్లనే ‘అమ్మో ఒకటో తారీఖు’ ఆశించిన స్థాయిలో ఆడలేదనే వారున్నారు” అంటూ చెప్పుకొచ్చారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!