ఆహారంలో బల్లి పడి విద్యార్థులకు అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికలు

జనగాం జిల్లాలోని కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయం హాస్టల్‌లో విద్యార్థులకు బల్లి పడిన ఆహారాన్ని అందించారు సిబ్బంది. దీంతో ఆహారం తిన్న కొందరు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

ఆహారంలో బల్లి పడటంతో 12 మంది బాలికలు అస్వస్థతకు గురైన ఘటన తెలంగాణ, జనగాం జిల్లాలో జరిగింది. జనగాం జిల్లా, దేవరుప్పుల గ్రామంలో కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ) ఉంది. ఇక్కడ హాస్టల్‌లో విద్యార్థినులకు గురువారం రాత్రి అందించిన ఆహారంలో బల్లి పడింది. దోసకాయ పచ్చడిలో బల్లి రావడాన్ని విద్యార్థులు గమనించారు. ఆలోపే కొందరు విద్యార్థులు ఆ పచ్చడి తిన్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!