ఆస‌క్తి రేకెత్తిస్తున్న అమలాపాల్ ‘క‌డ‌వ‌ర్’ ట్రైల‌ర్

న‌ట‌న ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న న‌టి అమలాపాల్‌. రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైతన్య హీరోగా న‌టించిన బెజ‌వాడ చిత్రంతో ఈ కేర‌ళ కుట్టి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది. ఆ త‌ర్వాత ఇద్ధ‌ర‌మ్మాయిల‌తో, నాయ‌క్ వంటి స్టార్ హీరోల‌ సినిమాల‌తో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది. గతేడాది కుడి ఎడ‌మైతే అనే సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ వెబ్ సీరిస్‌తో ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం ఈమె న‌టిస్తూ నిర్మించిన క‌డ‌వ‌ర్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అనూప్ పానిక్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్ర ఇన్వెస్టిగేటీవ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కింది. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

‘ఇప్ప‌టివ‌ర‌కు చేసింది.. ఇక‌పై చేయ‌బోయేది అంతా వివ‌రంగా ఆయ‌న‌కే చెప్పేశాను. మీ వ‌ల్ల‌యితే ఆపుకోండి’ అంటూ వాయిస్ రికార్డింగ్‌తో ట్రైల‌ర్ మొద‌లైంది. ‘అది 1920 అనుకుంటా.. సిడ్నీ స్మిత్ అనే పాంథాల‌జిస్ట్.. నూతిలోంచి దొరికిన మూడే ముడు ఎముక‌ల‌ను బ‌ట్టి, అదొక అమ్మాయ‌ని, ఆ అమ్మాయి హ్యండీకాపుడ్‌ అని, గ‌న్ షాట్ఏ డెత్‌కు రీజ‌న‌ని పోలీసుల‌కు రిపోర్ట్ ఇచ్చాడు. అయినా ఆ క‌థ‌కు మ‌న కేస్‌తో సంబంధం ఏంటని అర్థం కావ‌ట్లేదు’ అని అమలాపాల్ ప‌లికే సంభాష‌ణ‌లు క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఈ చిత్రంలో అమలాపాల్ పాథాల‌జిస్ట్/పోలీస్ స‌ర్జన్‌గా ప‌నిచేస్తుంది. ట్రైల‌ర్‌ను గ‌మినిస్తే ఒక మిస్సింగ్ అమ్మాయి డెడ్ బాడీ పోలీసుల‌కు రెండ్రోజుల‌కు దొరుకుతుంది. అమ‌లాపాల్ ఇన్వెస్టిగేష‌న్‌లో ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి చంపేశార‌ని తెలుస్తుంది. గ్యాంగ్ రేప్ చేసింది ఎవరు? ఎందుకు హత్య చేశారు? ఆస్తి కోసం సొంత తమ్ముడిని చంపింది ఎవరు? అనే అనేక ప్ర‌శ్న‌ల‌తో మేక‌ర్స్ ప్రేక్ష‌కుల‌లో విప‌రీత‌మైన క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. ఇన్వెస్టిగేటీవ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం తెలుగు-తమిళ భాష‌ల్లో ఆగ‌స్టు 12న నేరుగా డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుద‌ల కానుంది.

Nationalist Voice

About Author

error: Content is protected !!