ఆర్‌సీ పురంలో దారుణం.. హెడ్ కానిస్టేబుల్‌పై చైన్ స్నాచ‌ర్ క‌త్తితో దాడి

సంగారెడ్డి : రామ‌చంద్రాపురం పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో చైన్ స్నాచ‌ర్ దారుణానికి పాల్ప‌డ్డాడు. అశోక్‌న‌గ‌ర్ హెచ్ఐజీ గేటు వ‌ద్ద ఓ మ‌హిళ మెడ‌లో ఉన్న బంగారు గొలుసును దొంగించేందుకు చైన్ స్నాచ‌ర్ య‌త్నించాడు. అక్క‌డే విధుల్లో ఉన్న ఎస్‌వోటీ హెడ్ కానిస్టేబుల్ యాద‌య్య‌.. స్నాచ‌ర్‌ను గ‌మ‌నించాడు.అప్ర‌మ‌త్త‌మైన యాద‌య్య.. చైన్ స్నాచ‌ర్‌ను ప‌ట్టుకునేందుకు య‌త్నించాడు. దీంతో హెడ్ కానిస్టేబుల్‌పై స్నాచ‌ర్ క‌త్తితో దాడి చేసి పారిపోయాడు. యాద‌య్య‌కు తీవ్ర ర‌క్త‌స్రావం కావ‌డంతో స‌మీపంలో ఉన్న ఓ ప్ర‌యివేటు హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. యాద‌య్య‌ను సైబ‌రాబాద్ సీపీ స్టీఫెన్ ర‌వీంద్ర ప‌రామ‌ర్శించారు. మెరుగైన వైద్యం కోసం గ‌చ్చిబౌలిలోని ఏఐజీ ఆస్ప‌త్రికి యాద‌య్య‌ను త‌ర‌లించాల‌ని సీపీ ఆదేశించారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!