ఆప్ ఎంపీపై రాజ్య‌స‌భ స‌స్పెన్ష‌న్‌

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ సంజ‌య్ సింగ్‌కు వేటు ప‌డింది. రాజ్య‌స‌భ నుంచి వారం పాటు ఆయ‌న్ను స‌స్పెండ్ చేశారు. నినాదాలు చేస్తూ, పేప‌ర్ల‌ను చించివేస్తూ, చైర్‌పై విసిరేశార‌ని రాజ్యస‌భ డిప్యూటీ చైర్మెన్ హ‌రివంశ్ అన్నారు. మంగ‌ళ‌వారం 19 మంది ఎంపీల‌ను రాజ్య‌స‌భ నుంచి వారం పాటు స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం వ‌ర్షాకాల స‌మావేశాల నుంచి మొత్తం 24 మంది ఎంపీలు స‌స్పెండ్ అయ్యారు. లోక్‌స‌భ‌కు చెందిన న‌లుగుర్ని ఎంపీలు కూడా స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. ధ‌ర‌ల పెరుగుద‌ల‌, జీఎస్టీ వంటి అంశాల‌పై చ‌ర్చించాల‌ని విప‌క్ష ఎంపీలు ఉభ‌య‌స‌భ‌ల్లో ఆందోళ‌న చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. మ‌రోవైపు ఇవాళ లోక్‌స‌భ‌ను మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!