ఆత్మ‌కూరు ఎమ్మెల్యేగా మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి ప్ర‌మాణం

ఏపీ అసెంబ్లీలో నూత‌న ఎమ్మెల్యేగా మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేశారు. స్పీకర్ త‌మ్మినేని సీతారాం ఆయ‌న‌తో ప్ర‌మాణం చేయించారు. అదే జిల్లాకు చెందిన ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం నేప‌థ్యంలో నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు అసెంబ్లీ స్థానానికి ఇటీవ‌లే ఉప ఎన్నిక జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి పోటీ చేశారు. ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థిపై భారీ మెజారిటీతో విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

https://twitter.com/MekapatiVikram/status/1546449050496471040?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1546449050496471040%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Fflash-news-748252%2Fmekapati-vikram-reddy-takes-oath-as-atmakur-mla

Nationalist Voice

About Author

error: Content is protected !!