‘ఆకాశం’ ఓ అందమైన జర్నీ: శివాత్మిక రాజశేఖర్

  • ఫీల్ గుడ్ మూవీగా రూపొందిన ‘ఆకాశం’
  • ఆసక్తిని రేకెత్తిస్తున్న ముగ్గురు కథానాయికలు
  • దర్శకత్వం వహించిన కార్తీక్
  • నవంబర్ 4వ తేదీన విడుదల
తెలుగు తెరను మరో విభిన్నమైన ప్రేమకథా చిత్రం పలకరించనుంది. ఆ సినిమా పేరే ‘ఆకాశం’. సాగర్ నిర్మించిన ఈ సినిమాకి కార్తీక్ దర్శకత్వం వహించాడు. అశోక్ సెల్వన్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆయన సరసన రీతూ వర్మ .. అపర్ణ బాలమురళి .. శివాత్మిక రాజశేఖర్ అలరించనున్నారు. తాజాగా ఈ సినిమా టీమ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది.

ఈ వేదికపై అశోక్ సెల్వన్ మాట్లాడుతూ .. తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటారని నాకు తెలుసు. అలాంటి సినిమాలను ఆదరిస్తారని తెలుసు. అలాంటి ఒక కొత్త కంటెంట్ తో మేము నవంబర్ 4వ తేదీన థియేటర్లకు వస్తున్నాము. టైటిల్ కి తగినట్టుగా ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీ. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ఆశిస్తున్నాము” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ .. ఇది ఒక అందమైన సినిమా .. స్వఛ్ఛమైన సినిమా. ఎంతో ఇష్టంతో కష్టపడి చేసిన సినిమా. చూసిన ప్రతి ఒక్కరికీ ఇందులోని ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. ప్రతి పాత్రతో మీరు ట్రావెల్ చేస్తారు .. ప్రతి సన్నివేశంలో  మీరు ఉంటారు. అందరూ కూడా వచ్చేనెల 4న థియేటర్స్ కి వెళ్లండి .. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు” అంటూ చెప్పుకొచ్చింది.

Nationalist Voice

About Author

error: Content is protected !!