అర్ధరాత్రి నుంచి షారుక్ ఖాన్ ఇంటి ముందు వేలాది ఫ్యాన్స్ హంగామా

  • షారుక్ పుట్టిన రోజు సందర్భంగా జనసంద్రంగా మారిన మన్నత్ పరిసరాలు
  • చిన్న కొడుకు అబ్రామ్ తో కలిసి బాల్కనీలోకి వచ్చి అభిమానులను పలుకరించిన షారుక్
  • జనవరి 25న విడుదల కానున్న షారుక్ తదుపరి చిత్రం ‘పఠాన్’
Shah Rukh Khan makes rare appearance on birthday with son AbRam at Mannat greets fans
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఈ రోజు 57వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. షారుక్  పుట్టినరోజును ఆయన అభిమానులు పండుగలా భావిస్తారు. ప్రతీ ఏడాది నవంబర్ రెండో తేదీన ముంబైలోని షారుక్ ఇల్లు.. మన్నత్ వద్ద కోలాహలం ఉంటుంది. పుట్టిన రోజునాడు షారుక్ ను చూసేందుకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ అక్కడికి వస్తుంటారు. ఈసారి మంగళవారం అర్ధరాత్రి నుంచే అభిమానులు ఆయన ఇంటి వద్దకు బారులు తీరారు. బుధవారం తెల్లవారుజాములోపే మన్నత్ పరిసర ప్రాంతాలు జనసంద్రం అయింది. అభిమానులు బాణాసంచా కాలుస్తూ, అరుపులు, కేరింతలతో షారుక్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.

వారి అభిమానాన్ని, ఆప్యాయతల్ని కళ్లారా చూసేందుకు షారుక్.. రాత్రి పూట బయటకు వచ్చారు. తన చిన్న కొడుకు అబ్ రామ్ ను వెంటబెట్టుకొని మన్నత్ బాల్కనీలోకి వచ్చిన ఆయన.. ఫ్యాన్స్ కు అభివాదం చేశారు. చేయి ఊపుతూ, నమస్కారం చెబుతూ వాళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, తన సిగ్నేచర్ స్టయిల్ లో పోజు ఇచ్చి వారిని ఉత్సాహ పరిచారు. బాల్కనీ నుంచి సెల్ఫీ కూడా తీసుకున్నారు.  షారుక్ ను చూసిన వెంటనే అక్కడి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. షారుక్ చివరగా ‘బ్రహ్మాస్త్ర’లో అతిథి పాత్రలో కనిపించారు. ఆయన తదుపరి చిత్రం ‘పఠాన్’ వచ్చే జనవరి 25న విడుదల కానుంది.  సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకునే హీరోయిన్ గా  జాన్ అబ్రహాం విలన్ గా నటిస్తున్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!