అమ్ముడుపోయే వాడిని అయితే 12 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు పోయేవాన్ని: రాజగోపాల్ రెడ్డి

  • కాంగ్రెస్ కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి
  • కేసీఆర్ ను మునుగోడు ప్రజల వద్దకు తీసుకొచ్చేందుకే రాజీనామా చేశానని వెల్లడి
  • తన రాజీనామాతో మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్లు మొక్కుతున్నారన్న మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ టికెట్ ద్వారా దక్కిన మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… తాను ఎందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానన్న విషయాన్ని ఇప్పటికే పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలో తన విధానాలు, తన మనసులోని భావాలను జనానికి తెలియజేయడంతో పాటు వైరి వర్గాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని ఆయన మరోమారు ప్రస్తావించారు.

కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన తనను అమ్ముడుబోయారని రాజకీయ ప్రత్యర్థులు తనను విమర్శిస్తున్న వైనంపై రాజగోపాల్ రెడ్డి తాజా ట్వీట్ లో ప్రస్తావించారు. అమ్ముడుపోయే వాడిని అయితే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడినప్పుడే తాను కూడా పోయేవాడినని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కే కోట్ల రూపాయలు ఇచ్చినవాడిని తాను అని కూడా ఆయన పేర్కొన్నారు. దుర్మార్గమైన కేసీఆర్ మునుగోడు ప్రజల వద్దకు రావడానికే తాను రాజీనామా చేశానని వెల్లడించారు. తన రాజీనామాతో ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి మునుగోడు ప్రజల కాళ్లు మొక్కాల్సి వచ్చిందని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!