అమర్‌నాథ్ యాత్రికుల్ని రక్షిస్తున్న ఆర్మీ… ముమ్మరంగా గాలింపు

అమర్‌నాథ్ యాత్రికుల్ని భారత సైన్యం రక్షించే పనిలో పడింది. భక్తుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో వరద ప్రభావిత అమర్‌నాథ్ గుహ ప్రాంతంలో భారత సైన్యం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఆర్మీ డాగ్స్‌తో మొత్తం 10 ఆర్మీ రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యలను కొనసాగుతున్నాయి.వరదల్లో చిక్కుకుపోయిన అమర్‌నాథ్ యాత్రికులను (Amarnath Floods) రక్షించేందుకు భారత ఆర్మీ రంగంలోకి దిగింది. ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ బెటాలియన్ భక్తుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. దీనికోసం కశ్మీర్‌ లోయలో ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతుంది. అకస్మాత్తుగా మొదలైన వరదల కారణంగా 16 మంది యాత్రికులు చనిపోగా.. 40 మంది మిస్ అయ్యారు. దీంతో యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు స్థానిక పోలీసులు, అధికారులు శ్రమిస్తున్నారు. భారత ఆర్మీ కూడా ఆ పనిలో పడింది.

Nationalist Voice

About Author

error: Content is protected !!