అమరావతి రైతుల యాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

  • రాజమహేంద్రవరం పరిసరాల్లో కొనసాగుతున్న యాత్ర
  • యాత్రకు మద్దతు తెలిపేందుకు వచ్చిన రామకృష్ణారెడ్డి
  • రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వైనం
  • ఎండవేడిమికి తట్టుకోలేక సొమ్మసిల్లిపడిపోయిన మాజీ ఎమ్మెల్యే
ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు చేపట్టిన అమరావతి టూ అరసవెల్లి మహాపాదయాత్రలో పాల్గొన్న సందర్భంగా టీడీపీ నేత, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్ది సొమ్మసిల్లి పడిపోయారు. అమరావతి రైతుల యాత్ర ప్రస్తుతం రాజమహేంద్రవరం పరిసరాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం నాడు యాత్రకు మద్దతు తెలిపిన రామకృష్ణారెడ్ది రైతులతో కలిసి నడిచారు.

ఈ క్రమంలో ఎండవేడిమి తట్టుకోలేక రామకృష్ణారెడ్డి నడుస్తూనే కింద పడిపోయారు. ఓ మాజీ ఎమ్మెల్యే స్థాయి నేత ఉన్నట్లుండి కింద పడిపోవడంతో అమరావతి రైతులు ఆందోళనకు గురయ్యారు. ఆ వెంటనే షాక్ నుంచి తేరుకుని రామకృష్ణారెడ్డిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. గడచిన రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న రామకృష్ణారెడ్డి… జ్వరం తగ్గకపోయినా అమరావతి రైతుల యాత్రకు మద్దతు తెలిపేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలుస్తోంది.

Nationalist Voice

About Author

error: Content is protected !!