అమరావతి రైతుల పాదయాత్ర.. హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ!

  • పాదయాత్రను ఆపేయాలంటూ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్
  • పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు
  • ఐడీ కార్డులు ఉన్నవారు పాదయాత్రలో పాల్గొనవచ్చన్న హైకోర్టు
అమరావతి రైతుల పాదయాత్ర అంశంలో ఏపీ హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రైతుల పాదయాత్రను నిలిపివేయాలంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. పాదయాత్రను కొనసాగించవచ్చని చెప్పింది. అయితే, పాదయాత్రలో పాల్గొనే  రైతులకు ఐడీ కార్డులు ఉండాలని స్పష్టం చేసింది. ఐడీ కార్డులు ఉన్నవారే పాదయాత్రలో పాల్గొనాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, రైతులకు సంఘీభావం ప్రకటించే వారు మాత్రం ఏ రూపంలోనైనా మద్దతు తెలపొచ్చని అన్నారు. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలనన్నింటినీ పాటించాలని చెప్పారు.
Nationalist Voice

About Author

error: Content is protected !!