అక్షయ్ ‘రామ్ సేతు’ అదే జోరు.. రెండో రోజూ భారీ వసూళ్లు

  • మంగళవారం విడుదలైన ‘రామ్ సేతు’ చిత్రం
  • తొలి రోజు రూ. 15.25 కోట్లు వసూలు
  • రెండో రోజు మరో పదిన్నర కోట్ల కలెక్షన్
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘రామ్ సేతు’ చిత్రం భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. దీపావళి కానుకగా మంగళవారం విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. తొలి రోజు రూ. 15.25 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు రూ. 10.60 కోట్లు రాబట్టింది. దాంతో, రెండు రోజుల్లోనే ఈ  చిత్రానికి రూ. 25.85 కోట్ల వసూళ్లు వచ్చాయి. ‘బ్రహ్మాస్త్ర’ తర్వాత బాలీవుడ్ లో ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్ సాధించిన సినిమాగా ‘రామ్ సేతు’ నిలిచింది. అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రాల ‘థ్యాంక్ గాడ్’ చిత్రంతో పోటీ ఎదురైనప్పటికీ అక్షయ్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

దాంతో, వరుస పరాజయాల తర్వాత అక్షయ కుమార్ ఎట్టకేలకు విజయం సొంతం చేసుకున్నాడు. వారాంతంలోకి వెళ్తే ‘రామ్ సేతు’ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. అభిషేక్ శర్మ దర్శకత్వం వహించిన ‘రామ్ సేతు’ చిత్రంలో అక్షయ్ తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ భారుచాతో పాటు తెలుగు యువ నటుడు సత్యదేవ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇది యాక్షన్-అడ్వెంచర్ డ్రామా. రామసేతు పురాణమా లేదా వాస్తవమా? అనే విషయాన్ని పరిశోధించే పురావస్తు శాస్త్రజ్ఞుడి పాత్రలో అక్షయ్ నటించారు. ఈ చిత్రాన్ని అక్షయ్‌కి చెందిన కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, అబుందాంటియా ఎంటర్‌టైన్‌మెంట్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.

Nationalist Voice

About Author

error: Content is protected !!