అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలి: చంద్రబాబు, నారా లోకేశ్

  • దీపావళి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్
  • ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యాన్ని ఇంట్లోకి ఆహ్వానించే పండుగ దీపావళి అన్న చంద్రబాబు
  • విజయాల వెలుగులో బంగారు భవిష్యత్తుకు బాటలు  వేసుకోవాలన్న లోకేశ్
దీపావళి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. లోగిళ్లలో వెలుగులు నింపి ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇంట్లోకి ఆహ్వానించే దీపావళి పండుగ శుభవేళ… ఆ లక్ష్మీదేవి మీ ఇంటిల్లిపాదినీ సకల శుభాలతో అనుగ్రహించాలని కోరుకుంటున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

అపజయాల చీకట్లను చీల్చుకుంటూ, విజయాల వెలుగులతో మీరంతా బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆకాంక్షిస్తున్నానని నారా లోకేశ్ చెప్పారు. అందరూ ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!